హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైర్మన్ అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. నామినేషన్ పరిశీలన సమయంలో ఫారం-బి దాఖలు చేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, మున్సిపల్ కార్యాలయం ఎదుట తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో కలిసి పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు.