హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన గ్రామాల మధ్య రహదారి

PDPL: మంథని మండలం సూరయ్యపల్లి–కాకర్లపల్లి గ్రామాల మధ్య రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుపై కాలువ వద్ద దెబ్బతినడంతో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఇరువైపులా బండరాళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రింబవళ్లు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏమరుపాటుగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.