హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయి పోటీలకు సుండుపల్లి విద్యార్థుల ఎంపిక

అన్నమయ్య: సుండుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి మహమ్మద్ ఆయాన్, ఎనిమిదో తరగతి విద్యార్థి నాగచైతన్య సాఫ్ట్‌బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు పీడీ రాధారాణి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన వీరు ఈ నెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.