హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల విధులకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి'

గుంటూరు జిల్లాలో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీ.యం. సాయికాంత్‌ వర్మ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.