హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాలకు కారణమవుతున్న శిథిల పంపు

JGL: ధర్మపురి పట్టణంలోని చింతామణి చెరువు కట్ట రోడ్డుపై శిథిలమైన చేతిపంపు ప్రమాదకరంగా మారింది. కట్ట మరమ్మతుల్లో భాగంగా తొలగించాల్సిన పంపు రోడ్డు మధ్యలోనే మిగిలిపోయింది. ఆదివారం దానిని ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. రాత్రివేళ మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.