హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిటాల శ్రీరామ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు

సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రానికి చెందిన ఆరుగురు వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. స్థానిక నాయకుడు ఓబిలేసు ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన జె.మల్లేష్, రామాంజనేయులు, రాము, చౌడమ్మ, శివరత్నమ్మ, రొద్దం ఆంజనేయులకు టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో తమదే విజయమని శ్రీరామ్ అన్నారు.