హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకుంఠ అలంకారంలో భక్తులకు దివ్యదర్శనం

సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస వైకుంఠ అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.