హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెప్పాం.. చేస్తున్నాం' కరపత్రం విడుదల

ATP: చెప్పిన ప్రతి పనిని చేస్తూ, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. టీడీపీ అర్బన్ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి 'చెప్పాం.. చేస్తున్నాం' కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్లలో చేపట్టిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సహా సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు.