హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్‌ఎస్‌లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడుతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు.