హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్యంతో బాలుడు మృతి!

VZM: రేగిడి మండలం లచ్చరాయపురానికి చెందిన ఊసెట్టి బాలు (7) అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలుడు దసరా సెలవుల్లో తాతగారింటికి వెళ్లగా టైఫాయిడ్ జ్వరం సోకింది. చికిత్స అనంతరం తిరిగి తీసుకొస్తుండగా బస్సులోనే స్పృహ కోల్పోయాడు. పాలకొండ, శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.