హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనం ప్రారంభమెప్పుడో..?

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అందర్బందాలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడంతో మహిళా సంఘాల సమావేశాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాల్సి వస్తోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి భవనాన్ని త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.