ADB: బజార్హత్నూర్ మండలం గంగాపూర్ సమీపంలోని గుట్టల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టలను యథేచ్ఛగా తవ్వి మట్టి, రాళ్లను తరలిస్తూ కొందరు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఆదాయానికి గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
గంగాపూర్ సమీపంలో గుట్టల అక్రమ తవ్వకాలు..?


