హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విశాఖకు ప్రత్యేక రైళ్లు

VSP: రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు పూజా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07423 నంబర్ గల ఈ రైలు ఇవాళ ఉదయం 9.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, కడప, గుంతకల్లు, నంద్యాల, గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం మీదుగా బుధవారం ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు.