హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణ వధకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి: CP

WGL: విజయదశమి సందర్భంగా ఉర్సు రంగలీలా మైదానంలో నిర్వహించనున్న రావణ వధ కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ శ్వేత అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.