HNK: రావణ వధ కార్యక్రమాల వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలని NPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. ఇవాళ సాయంత్రం తర్వాత నిర్వహించే రావణ వధ కార్యక్రమాలను విద్యుత్ లైన్లకు దూరంగా ఉండి వీక్షించాలని కోరారు. విద్యుత్ సంబంధిత అత్యవసర సేవల కోసం సమీపంలోని సబ్ స్టేషన్ లేదా 1912 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.
తెలంగాణ
'రావణ వధ వద్ద అప్రమత్తంగా ఉండాలి'


