హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంతిపూల ధరలకు రెక్కలు

NGKL: దసరా పండుగ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్‌లో బంతిపూల ధరలు పెరిగాయి. సోమవారం వ్యాపారులు కిలో బంతిపూలను రూ.120 నుంచి రూ.180 వరకు విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధరలు అధికంగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయని పేర్కొన్నారు.