హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజేలు నిషేధం.. పోలీసులకు సహకరించాలి

NZB: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోధన్ రూరల్ పరిధిలోని గ్రామాల్లో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల్లో డీజే సౌండ్ సిస్టం వినియోగాన్ని నిషేధించినట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమ్మవారి విగ్రహాల నిమజ్జన సమయంలో నిర్వాహకులు పోలీసుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.