హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరాస్పూర్‌లో కబడ్డీ టోర్నమెంట్

VKB: కొడంగల్ మండలం పరాస్పూర్ గ్రామంలో యువత ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. సర్పంచ్ రాధ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో జరిగిన ఈ పోటీల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.