హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 5న పాఠశాల స్వర్ణోత్సవం

VKB: బొంరాస్పెట్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలను డిసెంబర్ 5న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని సమావేశంలో తీర్మానించారు. పాఠశాలతో అనుబంధం ఉన్న ప్రతి పూర్వ విద్యార్థి స్వర్ణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.