SDPT: సద్దుల బతుకమ్మ సందర్భంగా గజ్వేల్‌కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పూలతో అమ్మవారి రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. బంతి, చామంతి, మల్లె పూలతో జడ, కిరీటం, ఆభరణాలతో అలంకరించి, తన ఇంట్లో సతీసమేతంగా పూజలు నిర్వహించారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.
తెలంగాణ
పూలతో అమ్మవారి రూపం


