WGL: రాయపర్తి మండలంలోని సన్నూరు స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొమ్మిదో రోజు అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
సన్నూరులో మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు


