హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల కొరడా

HYD: నగరంలో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గత ఎనిమిది నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన 100 వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీటిలో 88 ద్విచక్ర వాహనాలు, 12 కార్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆయా వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. నంబర్ ప్లేట్లలో అక్రమ మార్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.