RR: షాద్‌నగర్‌లోని పెద్ద జానంపేట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అక్టోబర్ 20న జరగనున్న దసరా వేడుకలు, రావణ దహన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వీహెచ్‌పీ, హిందూ వాహిని నాయకులు పరిశీలించారు. సాయంత్రం 4:30 గంటలకు కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
పెద్ద జానంపేటలో రావణ దహనానికి సన్నాహాలు


