హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీలో ఏడుగురికి షోకాజ్ నోటీసులు

KMR: కొండాపూర్ జీపీ లో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఏడుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ప్రజావాణిలో గ్రామస్థులు ఆధారాలతో ఫిర్యాదు చేయగా, అధికారులు విచారణ చేపట్టారు. నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘన, లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడంతో సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీఓతో పాటు నలుగురు జీపీ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు.