హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణుగూరులో మెడికల్ షాపుల్లో అధికారుల తనిఖీలు

BDK: మణుగూరులో సోమవారం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అశ్విని, సీఐ నాగబాబు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. లైసెన్సులు, మందుల నిల్వలు, గడువు ముగిసిన ఔషధాలు, కొనుగోలు బిల్లులు, విక్రయ రికార్డులను పరిశీలించారు. ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలు, ఫార్మసిస్ట్ అందుబాటుపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.