హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎలినినో ప్రభావంతో వ్యవసాయానికి ఇబ్బందులు: మంత్రి

BDK: ఎలినినో ప్రభావంతో వ్యవసాయరంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అశ్వాపురంలో తెలిపారు. భూగర్భ జలాలు తగ్గడం, రిజర్వాయర్లలో నీటి కొరత, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వనరుల సమస్యలు రైతులపై ప్రభావం చూపవచ్చన్నారు. తక్కువ నీటితో పండే కూరగాయలు, పప్పుదినుసులు, ఒకటి రెండు తడులతో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.