హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరాకు విద్యుత్ అంతారాయాలు కలుగకుండా చూడాలి'

HNK: దసరా పండుగ నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు కలగకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హన్మకొండ విద్యుత్ భవన్ ప్రధాన కార్యాలయం నుంచి 18 జిల్లాలకు చెందిన సూపరింటెండింగ్ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.