హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

KMM: భూభారతి ద్వారా ఏళ్లనాటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, రైతులకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, భూముల రీ-సర్వే, పాస్‌బుక్కుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు.