హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి

SRD: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తొమ్మిది మంది సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ SIలకు ఆదేశించారు.