HYD: ఏషియన్ థియేటర్స్లో రూ.36 లక్షలకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అకౌంటెంట్ అగతమూడి హరీష్ నకిలీ చెక్కులు, ఆన్లైన్ లావాదేవీల ద్వారా సంస్థ నగదును తన సోదరుడు, ఇతరుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతర్గత తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడటంతో సంస్థ ఖాతాల విభాగం అధిపతి రాజశేఖర్ యాదవ్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
ఏషియన్ థియేటర్స్లో భారీ అక్రమాలు


