హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి

GDWL: జిల్లా కేంద్రంలోని వేదనగర్ శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సభ్యులు ఆమెను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బండ్ల జ్యోతి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.