హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేళ కరెంట్ కట్‌పై ప్రజల ఆగ్రహం

MDCL: రసూల్‌పురాలో విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకమ్మ పండుగ సమయంలో 2 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.