హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన ఎంపీడీవో

KMR: లింగంపేట (M) లోని పోల్కంపేట్ గ్రామాన్ని సోమవారం ఎంపీడీవో నరేష్ సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. బోరుబావుల రీఛార్జ్ కోసం చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి అశ్వక్ వున్నారు.