VKB: జిల్లాలోని బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, నిల్వ ఉన్న మురుగునీటితో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద కూడా పెరుగుతోందని, దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్లో మురుగునీటితో దుర్వాసన


