NGKL: మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లికి చెందిన చెన్నకేశులు KLI కాలువలో గల్లంతయ్యారు. సోమవారం స్నానానికి వెళ్లిన ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. కాలువ అంచున దుస్తులు, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులు గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాఘవేందర్‌రెడ్డి, ఫైర్ సిబ్బందితో కలిసి కాలువలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ
కాలువలో వ్యక్తి గల్లంతు


