హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

HYD: KPHB పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నానికి చెందిన దంతులూరి వరాహాలరాజు (61) ఉదయం తాను నివసిస్తున్న ఎస్‌ఆర్ టవర్స్ భవనం పైనుంచి దూకి మృతిచెందారు. కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు ఆయన భార్య రామదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.