హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో మహిళకు వేధింపులు

MDCL: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను వేధించిన ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి భర్తతో కలిసి చర్లపల్లి–పర్వతాపూర్‌లోని ఇంటికి వెళ్తున్న దంపతులు చెంగిచర్ల వైన్స్ వద్ద ఆగారు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బీర్ తాగుతావా అంటూ ఆమెను వేధించారు. దంపతులు మందలించడంతో మరికొందరితో కలిసి కారులో వారి ఇంటి వరకు వెంబడించినట్లు సమాచారం.