హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు, పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత స్టడీ మెటీరియల్, పుస్తకాలను పంపిణీ చేశారు. యువత పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని జీఎంఆర్ సూచించారు. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు 2016లో సేవా సమితిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.