హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాలయంలో అమ్మవారి సేవలో మంత్రి సీతక్క

MLG: జిల్లా కేంద్రంలోని రామాలయంలో శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈవేడుకల్లో రాష్ట్రమంత్రి సీతక్క పాల్గొని దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.