ASF: మిషన్ భగీరథ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని.. ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేశారు. పండుగ వేళ వేతనాలు అందక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు చెల్లించాలి'


