JGL: గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెలోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సల్లూరి శోభన్ గౌడ్ ఉన్నారు.
తెలంగాణ
దుర్గాభవాని ఆలయంలో కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక పూజలు


