KMR: నాగిరెడ్డిపేట ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సునీత ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు ప్రిన్సిపల్ రాంప్రసాద్ సోమవారం తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకే ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఆరుగురు విద్యార్థులకు ఉపకార వేతనాలు


