హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా దుర్గాభవాని అమ్మవారి వార్షికోత్సవం

SDPT: తొగుట మండలం ఖాన్గల్‌లోని శ్రీ మూలగుండు దుర్గాభవాని అమ్మవారి 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన పూజలు వైభవంగా జరగగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం మహిళలు బతుకమ్మ ఆటలు ఆడి సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.