SRD: కంగ్టి మండలం గాజులపాడు గ్రామంలో సోమవారం భవాని మాత బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల తొమ్మిదో రోజు మహాదేవుని ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. అనంతరం మహిళలు బోనాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మొక్కులు తీర్చుకోవడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
తెలంగాణ
VIDEO: వైభవంగా భవాని మాత బోనాలు


