హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో కోతలు.. రైతుల ఆందోళన

NLG: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ధాన్యం తూకంలో అధిక కోతలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించే సమయంలో అదనపు కోతలు, రవాణా ఆలస్యాలు తమకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.