JN: పాలకుర్తి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షుడు కమ్మగాని పరుశరాములు గౌడ్ జెండాను ఆవిష్కరించారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాలకుర్తిలో కల్లుగీత కార్మిక సంఘం వార్షికోత్సవం


