హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాదం.. ఐదుగురిని రక్షించిన పోలీసులు

NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురాలో పాదరక్షల దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు క్రమంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో భవనం మొదటి అంతస్తులో చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.