హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో నామినేషన్ పత్రం చించివేత

ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేవీ నారాయణ ఆదివారం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అయితే, ఆయన నామినేషన్ పత్రాన్ని సోమవారం మరో వర్గానికి చెందిన వ్యక్తులు చించివేసినట్లు సమాచారం. ఈ ఘటనతో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.