హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరుగా సీపీఎం అభ్యర్థి ప్రచారం

విజయనగరం పట్టణం 56వ డివిజన్ సీపీఎం అభ్యర్థి పాలూరి రమణమ్మ కార్పొరేటర్‌గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె సోమవారం పట్టణం కనపాకలో తారకరామ కాలనీలో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరాయంగా పోరాడుతున్న సీపీఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా స్థానికులను కోరారు.