హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి మాజీ కార్పొరేటర్ సస్పెన్షన్

కాకినాడకు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ రొక్కల సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న ప్రకటించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ సస్పెన్షన్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.